అంతెత్తున్న అలపై అలవోకగా.. | Surfer Andrew Cotton's quest to chase world's biggest and most | Sakshi
Sakshi News home page

అంతెత్తున్న అలపై అలవోకగా..

Feb 4 2014 2:49 AM | Updated on Sep 2 2017 3:18 AM

అంతెత్తున్న అలపై అలవోకగా..

అంతెత్తున్న అలపై అలవోకగా..

అనకొండలా మింగేయడానికి వస్తున్నట్లు ఉన్న ఈ ‘అల’కొండను చూశారా? దీని ఎత్తు ఏకంగా 80 అడుగులు!

అనకొండలా మింగేయడానికి వస్తున్నట్లు ఉన్న ఈ ‘అల’కొండను చూశారా? దీని ఎత్తు ఏకంగా 80 అడుగులు! అయినా సరే.. అంతెత్తున్న తుపాను అలపై అలవోకగా సర్ఫింగ్ చేసేశాడు బ్రిటన్‌లోని డెవాన్‌కు చెందిన ఆండ్రూ కాటన్. ఆదివారం పోర్చుగీస్‌లోని నజారే తీరంలో ఈ సాహసకృత్యాన్ని చేశాడు. ఇప్పటివరకూ 78 అడుగులున్న అలపై సర్ఫింగ్ చేయడమే ప్రపంచ రికార్డుగా ఉంది. ఇది 80 అడుగుల అల అని చెబుతున్నారు. ఇతడి రికార్డును గిన్నిస్ బుక్ వారు ధ్రువీకరించాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement