సింక్ హోల్లో పడిపోయిన దంపతులు | Sinkhole swallows couple in Seoul | Sakshi
Sakshi News home page

సింక్ హోల్లో పడిపోయిన దంపతులు

Feb 25 2015 9:42 PM | Updated on Sep 2 2017 9:54 PM

సింక్ హోల్లో పడిపోయిన దంపతులు

సింక్ హోల్లో పడిపోయిన దంపతులు

బస్సు స్టాప్లో బస్సు ఆగింది. తాము దిగే స్టాప్ వచ్చిందని భర్త దిగాడు.

సియోల్: బస్సు స్టాప్లో బస్సు ఆగింది. తాము దిగే స్టాప్ వచ్చిందని భర్త దిగాడు. అతడి వెంటనే అడుగులో అడుగు వేసుకుంటూ భార్య కూడా దిగింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పాదచారుల మార్గంలో నడుస్తుండగా... ఆ మార్గం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ దంపతులు ఇద్దరు ఒక్కసారిగా భూమిలోకి చోచ్చుకుని పడిపోయారు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్రేన్ల సహాయంతో భార్యాభర్తలను బయటకు తీశారు.

అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన దక్షిణ కోరియా రాజధాని సియోల్ నగరంలో చోటు చేసుకుంది. ఇదంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పాదచారుల మార్గంలో డోల్లా ఎలా ఏర్పడిందనే అంశంపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement