ఫిబ్రవరి నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ గురువారంతో ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి.
ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు
Feb 20 2017 9:53 AM | Updated on Sep 5 2017 4:11 AM
	ముంబై : ఫిబ్రవరి నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ గురువారంతో ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 18.26 పాయింట్ల లాభంలో 28,487 వద్ద, నిఫ్టీ 9.15 పాయింట్ల లాభంలో 8,830 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో టీసీఎస్, హెచ్యూఎల్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, కొటక్ మహింద్రా బ్యాంకు, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభపడగా.. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటీసీ, సిప్లా, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ నష్టాలు గడించాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడింది. ట్రేడింగ్ ప్రారంభంలో 67.06 వద్ద ప్రారంభమైంది.
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	శివరాత్రి సందర్భంగా ఈ నెల 24(శుక్రవారం) స్టాక్ మార్కెట్ సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది.  ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు  ధరల గమనం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి...తదితర అంశాలు కూడా ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
