మోడల్‌ను 140 సార్లు కత్తితో పొడిచి.. కళ్లు పీకి.. | Russian model stabbed for 140 times by own sister | Sakshi
Sakshi News home page

మోడల్‌ను 140 సార్లు కత్తితో పొడిచి.. కళ్లు పీకి..

Apr 6 2017 8:03 AM | Updated on Sep 5 2017 8:07 AM

మోడల్‌ను 140 సార్లు కత్తితో పొడిచి.. కళ్లు పీకి..

మోడల్‌ను 140 సార్లు కత్తితో పొడిచి.. కళ్లు పీకి..

రష్యాలో ఘోరం జరిగింది. టీనేజిలో ఉన్న ఒక మోడల్‌ను ఆమె సొంత అక్కే దారుణాతి దారుణంగా హతమార్చింది. 140 సార్లు కత్తితో పొడిచి, కనుగుడ్లు బయటకు లాగేసి, చెవులు కోసేసి మరీ చంపింది.

రష్యాలో ఘోరం జరిగింది. టీనేజిలో ఉన్న ఒక మోడల్‌ను ఆమె సొంత అక్కే దారుణాతి దారుణంగా హతమార్చింది. 140 సార్లు కత్తితో పొడిచి, కనుగుడ్లు బయటకు లాగేసి, చెవులు కోసేసి మరీ చంపింది. మృతురాలి పేరు స్టెఫానియా డుబ్రోవినా. ఆమె సోదరి ఎలిజవెటా బాగా డ్రగ్స్ తీసుకుని, ఆ మత్తులోనే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన స్టెఫానియా.. తన సొంత ఫ్లాట్‌లోనే హత్యకు గురైంది. అప్పటికి స్టెఫానియా, ఆమె సోదరితో పాటు మరో వ్యక్తి కూడా ఆ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది.

అతడు మద్యం కొనుక్కోడానికి బయటకు వెళ్లగానే ఎలిజవెటా తలుపులన్నీ మూసేసి, చెల్లెలిని దారుణాతి దారుణంగా పొడిచి చంపింది. అక్కడితో ఆమె కోపం చల్లారలేదు. చెవులు కోసేసి, నానా బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత మృతదేహానికి బాగా జుట్టు దువ్వి, మేకప్ చేసింది కూడా! చెల్లెలికి మోడల్‌గా బాగా పేరు రావడంతో ఈర్ష్య తట్టుకోలేకనే ఆమె ఇలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. స్టెఫానియా తన షోలలో బాగా పనిచేసేదని, ఆమె చాలా ఆకర్షణీయంగా ఉండేదని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన స్టాస్ బారెట్‌స్కీ చెప్పారు. అలాంటి అమ్మాయి హత్యకు గురైందన్న విషయం తెలిసి షాకయ్యానన్నారు. అమ్మాయి బంధువు కూడా ఈ విషయం గురించి చెప్పారు. ఈ దారుణ హత్య గురించి తెలిసినప్పుడు ఒక్కసారిగా తనకు వెన్నులో వణుకు పుట్టిందని, రక్తం గడ్డకట్టుకుపోయినట్లు అయ్యిందని ఆమె అన్నారు. ఇంత దారుణానికి కారణం ఏమై ఉంటుందో చెప్పలేకపోతున్నానని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement