మ్యాచ్‌ జరుగుతుండగా.. అర్ధనగ్నంగా

Russian model interrupted Champions League Football Final Match - Sakshi

మాడ్రిడ్‌: ప్రస్తుత యువత సెన్సేషన్‌ కోసం దేనికైనా తెగిస్తున్నారు. ఎవరో ఏదో ఒక చోట ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యారని, వారిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. నలుగురు ఏమనుకుంటారు, ఎవరికైనా ఇబ్బందులు కలిగిస్తున్నామా అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు చేసేస్తున్నారు. ఒక్కోసారి వారు చేసే వెకిలిచేష్టలు విజయవంతమయి ఓవర్‌ నైట్‌ స్టార్‌ అవుతున్నారు. మరికొందరి ప్రయత్నాలు విఫలమై కటకటాల పాలవుతున్నారు. 

స్పెయిన్లోని మాడ్రిడ్ లో చాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుండగా, ఓ యువతి అర్థనగ్నంగా గ్రౌండ్ లోకి వచ్చి సంచలనం సృష్టించింది. కిన్సే వోలాన్స్‌స్కీగా అనే రస్యా మోడల్‌ తరచూ ఇలా సంచలనం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడం అలవాటుగా మార్చుకుందట. అందుకే ఫుట్ బాల్ మ్యాచ్ లో ఇలా బరితెగించి ఒళ్లు మైమరిచి పరుగులు అందుకుంది. సెక్యూరిటికి దొరకకుండా గ్రౌండ్‌ మొత్తం పరిగెత్తింది.  దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. చివరికి మ్యాచ్ నిర్వాహకులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇక ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో గర్వంగా షేర్‌ చేసింది వోలాన్స్‌స్కీగా. ‘ఈ రోజు చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కోసం ఇలా వెళ్లాను. ఎంతో గర్వంగా ఉంది’అంటూ ఫోటోతోపాటు ఈ కామెంట్‌ను జతచేసింది. యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌నైట్‌ స్టార్‌ కావడం కోసం స్విమ్మింగ్‌ డ్రెస్‌లో మ్యాచ్‌కు వెళతావా నీకు ఇంతనైనా సిగ్గుందా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top