ముగ్గురు ఆగంతకులు పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు.
కుషాయిగూడ: ముగ్గురు ఆగంతకులు పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన కుషాయిగూడ ఈశ్వరపురి కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఇంటి ముందు ఎవరో వ్యక్తులు సంచరిస్తుండడంతో శైలజ అనే మహిళ తలుపు తెరచి చూసింది.
అంతలోపే ముఖానికి గంతలు కట్టుకున్న ముగ్గురు వ్యక్తులు లోపలికి చొచ్చుకువచ్చి ఆమెను కత్తులతో చంపుతామని బెదిరించారు. లోపల బీరువాలో ఉన్న సుమారు 20 నుంచి 30 తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.