హైదరాబాద్ నవాబు కుటుంబ సభ్యుడికి అవార్డు | Prince Mohsin Ali Khan awarded in UK | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ నవాబు కుటుంబ సభ్యుడికి అవార్డు

Nov 24 2013 10:57 PM | Updated on Sep 2 2017 12:57 AM

హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబు కుటుంబ సభ్యుడు ప్రిన్స్ మోసిన్ అలీఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది.

లండన్: హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబు కుటుంబ సభ్యుడు ప్రిన్స్ మోసిన్ అలీఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది.  ప్రపంచశాంతికి, స్వంచ్ఛంద సంస్థల తోడ్పాటుకు విశేష సేవలందించినందుకుగాను ఆయనను లండన్‌లో ఘనంగా సత్కరించారు.‘వరల్డ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ పౌండేషన్’కు  అలీఖాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  ఈ సంస్థ వార్షికోత్సవం లండన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి నగరంలోని అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా మోసిన్ అలీఖాన్‌తో పాటు, సియాసత్ ఉర్దూ దినపత్రిక చీఫ్ ఎడిటర్ జాహిద్ అలీఖాన్, ఇండియన్ ఏయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన ఉస్మాన్ షాహిద్‌లతో పాటు వివిధ రంగాలలో సేవలందించిన మరికొందరిని అవార్డులతో సత్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement