ఆమ్ ఆద్మీనే.. | patiala mp dharamvir gandhi slept in front of parliament | Sakshi
Sakshi News home page

ఆమ్ ఆద్మీనే..

Nov 26 2014 1:31 AM | Updated on Apr 4 2018 7:42 PM

ఆమ్ ఆద్మీనే.. - Sakshi

ఆమ్ ఆద్మీనే..

పార్లమెంటు ముందు పచ్చికపై కునుకేస్తున్న ఈయన ఎవరో తెలుసా? ఓ ఎంపీ! పేరు ధరమ్‌వీర్ గాంధీ.

పార్లమెంటు ముందు పచ్చికపై కునుకేస్తున్న ఈయన ఎవరో తెలుసా? ఓ ఎంపీ! పేరు ధరమ్‌వీర్ గాంధీ. ఎంపీ అనేసరికి మనం అంతా హైఫై అని ఊహించుకుంటాం. కానీ ఈయన తన పార్టీ పేరు (ఆమ్ ఆద్మీ పార్టీ)కు తగ్గట్లే.. ఓ సామాన్యుడిలా మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటు లాన్స్‌లో కునుకేశారు.

పంజాబ్‌లోని పటియాలాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధరమ్‌వీర్ కార్డియాలజిస్ట్. హస్తవాసిగల వైద్యుడిగా పేరుంది. పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారు. గత ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్‌పై గెలుపొందారు. తన కాలేజీ రోజుల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి.. కొంత కాలం జైలులో కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement