మోదీని కలిసిన నేతాజీ కుటుంబీకులు | Netaji's family members meet Modi | Sakshi
Sakshi News home page

మోదీని కలిసిన నేతాజీ కుటుంబీకులు

Oct 14 2015 6:22 PM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీని కలిసిన నేతాజీ కుటుంబీకులు - Sakshi

మోదీని కలిసిన నేతాజీ కుటుంబీకులు

నేతాజీ కుటుంబ సభ్యులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.

ఢిల్లీ: నేతాజీ కుటుంబ సభ్యులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీ చివరి రోజులకు సంబంధించిన పలు రహస్య పత్రాలను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా తమ వద్ద ఉన్న నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గత నెలలో ప్రధాని .. భారత్ తో పాటు విదేశాలలో ఉన్న నేతాజీకి చెందిన 50 మంది కుటుంబ సభ్యులను కలుస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మోదీ.. నేతాజీకి చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేస్తామని హామీ ఇచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement