ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది! | Neerja taught me kindness, self worth, says Sonam Kapoor | Sakshi
Sakshi News home page

ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది!

Sep 7 2016 2:36 PM | Updated on Sep 4 2017 12:33 PM

ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది!

ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది!

నీర్జా బానోత్.. విమాన ఉద్యోగి అయిన ఆమె 23 ఏళ్ల వయస్సులో నిరూపమానమైన ధైర్యసాహసాన్ని చూపింది.

నీర్జా బానోత్..  విమాన ఉద్యోగి అయిన ఆమె 23 ఏళ్ల వయస్సులో నిరూపమానమైన ధైర్యసాహసాన్ని చూపింది. ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానంలోని ప్రయాణికులను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది. తన పుట్టినరోజుకు కేవలంర రెండురోజుల ముందు ఉగ్రవాదుల కాల్పుల్లో ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె జయంతి సెప్టెంబర్ 7 కావండంతో బాలీవుడ్ నటి సోనం కపూర్.. ఆమెను స్మరించుకుంది. సాటివారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆమె గొప్పతనాన్ని కీర్తిస్తూ ఘనంగా నివాళులర్పించింది.

నీర్జా బానోత్ పాత్రను వెండితెరపై అద్భుతంగా పోషించిడం ద్వారా ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలను సోనం కపూర్  పొందిన సంగతి తెలిసిందే. నీర్జా బానోత్ కు నివాళులర్పిస్తూ.. ఆమె తల్లితో దిగిన ఫొటోను సోనం ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ' హ్యాపీ బర్త్ డే నీర్జా. నీ జన్మదినం నాకెంతో ప్రత్యేకమైనది. నువ్వెప్పుడూ చీకట్లో వెలుగుదీపమై నన్ను నడిపిస్తావు. నాకు ఎన్నో విధాలుగా స్ఫూర్తినిచ్చావు. నీ పాత్ర పోషించడంతో నాలో సహనం, దయాగుణాన్ని మరింతగా నింపింది. అన్నింటికన్నా స్వీయ ఉనికి అంటే ఏమిటో తెలిపింది' అని సోనం పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement