క్లాస్‌రూమ్‌ కైండ్‌నెస్‌ యాక్టివిటీ | Promote kindness in your classroom with our collaborative Kindness Quilt Activity | Sakshi
Sakshi News home page

క్లాస్‌రూమ్‌ కైండ్‌నెస్‌ యాక్టివిటీ

Nov 13 2025 12:52 AM | Updated on Nov 13 2025 12:52 AM

Promote kindness in your classroom with our collaborative Kindness Quilt Activity

నేడు వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే

వివిధ పోటీల్లో పాల్గొనడం, సమకాలీన సాంకేతికతతో పరుగులు తీయడం మాట ఎలా ఉన్నా... ఈ పరుగులో ‘దయాగుణం’ అనేమాట వినబడడం అరుదైపోయింది. ఎంత పెద్ద నాగరికత అయినా నిలవడానికి ‘దయాగుణం’ అనేది పునాదిలా ఉపయోగపడుతుంది. ‘ఇంటి నుంచే మంచితనం మొదలు కావాలి’ అంటారు. ఇల్లే కాదు తరగతి గది అని కూడా చెప్పుకోవచ్చు. ‘కైండ్‌నెస్‌ క్విల్ట్‌ కొలాబరేటివ్‌ క్లాస్‌ ప్రాజెక్ట్‌’ నుంచి ‘కైండ్‌నెస్‌ ప్లెడ్జ్‌’ వరకు రకరకాల యాక్టివిటీల ద్వారా క్లాస్‌రూమ్‌లో కైండ్‌నెస్‌ 
వైబ్స్‌ సృష్టించవచ్చు...

క్లాస్‌రూమ్‌ కైండ్‌నెస్‌ యాక్టివిటీల ద్వారా చిన్న వయసులోనే పిల్లల మనసులో దయాగుణానికి సంబంధించిన బీజాలు పడతాయి.
గోడలపై గొప్ప మాటలు ‘దయాగుణం అనేది విశిష్ట భాష. ఆ భాషను చెవిటివాళ్లు కూడా వినగలరు. మూగవాళ్లు కూడా మాట్లాడగలరు’
‘ఆత్మీయ పలకరింపు, కల్మషం లేని నవ్వు అనేవి దయాగుణానికి సంబంధించిన విశ్వభాషలు’ ‘దయాహృదయాలు తోటలాంటివి.
దయాగుణంతో చేసే ఆలోచనలు వేళ్లలాంటివి. దయాగుణంతో చేసే మంచిపనులు ఆ తోటలో కాసే ఫలాలు’
‘మంచి పనులు చేయడానికి కావాల్సింది డబ్బు కాదు. మంచి మనసు’... దయాగుణం విశిష్ఠతకు సంబంధించి ఇలాంటి ప్రసిద్ధ కోట్స్‌ తరగతి గోడలపై కనిపించాలి.

కైండ్‌నెస్‌ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌
కైండ్‌నెస్‌ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా మదర్‌ థెరెసాలాంటి ప్రపంచ ప్రసిద్ధ దయామయులను పరిచయం చేయాలి. వారు చేసిన స్ఫూర్తిదాయకమైన పనుల గురించి వివరించాలి.

వ్యక్తుల దయాగుణాన్ని గురించి చెప్పేవి షార్ట్స్, రీల్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిని పిల్లలకు చూపించాలి.
ఉదా: ‘అనారోగ్యానికి గురైన స్టూడెంట్‌ కోసం రోజూ హాస్పిటల్‌కు వెళ్లే టీచర్‌. హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్నప్పటికీ టీచర్‌ను చూడగానే ఆ స్టూడెంట్‌లో ఉత్సాహం వస్తుంది’
కైండ్‌నెస్‌ ప్లెడ్జ్‌
దయాగుణం గొప్పదనం గురించి చెప్పే ఎన్నో కథలు, జానపదాలు, పురాణాల్లో ఉన్నాయి.‘ఈరోజు కథ’ పేరుతో రోజుకు ఒక కథ విద్యార్థులకు చెప్పాలి. దయాగుణం ప్రాముఖ్యత గురించి చెప్పిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకాలు వాట్‌ డజ్‌ ఇట్‌ మీన్‌ టు బి కైండ్, ది కైండ్‌నెస్‌ క్వాలిటీ, హౌ టు హీల్‌ ఏ బ్రోకెన్‌ వింగ్, కైండ్‌నెస్‌ ఈజ్‌ కూలర్‌... వంటి వాటి గురించి పరిచయం చేయాలి.

‘ఆపదలో ఉన్నవారికి నా వంతుగా సహాయం చేస్తాను’, ‘సేవాకార్యక్రమాల్లో పాల్గొంటాను’... ఇలాంటి మంచి మాటలతో కైండ్‌నెస్‌ ప్లెడ్జ్‌ చేయించాలి. ‘కైండ్‌నెస్‌ క్విజ్‌’లాంటివి కూడా పిల్లల్లో ఆసక్తి కలిగిస్తాయి. ఉదాహరణకు... 

నువ్వు స్కూల్‌కు వెళుతున్నప్పుడు ఒక వృద్ధుడు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు?
ఎ. తాతకు సహాయం చేయాలని ఉన్నా, స్కూలుకు లేటవుతుంది కాబట్టి సహాయం చేయను
బి. ఎవరో ఒకరు తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి స్కూల్‌కు వెళతాను/ సి. స్కూల్‌కు ఆలస్యం అయినా సరే, తాతకు సహాయం చేస్తాను. ఎందుకు ఆలస్యం అయిందో టీచర్‌కు చెబుతాను

స్థూలంగా చెప్పాలంటే కైండ్‌నెస్‌ క్లాస్‌యాక్టివిటీలకు పరిమితులు, నిర్దిష్ట నిబంధనలు లేవు. ఎవరి సృజనాత్మకత ప్రకారం వారు డిజైన్‌ చేసుకోవచ్చు.
ఈరోజే మంచి రోజు... ఇక ఆలస్యం ఎందుకు!

కైండ్‌నెస్‌ క్విల్ట్‌  కొలాబరేటివ్‌ క్లాస్‌ ప్రాజెక్ట్‌
‘కైండ్‌నెస్‌ క్విల్ట్‌ కొలాబరేటివ్‌ క్లాస్‌ ప్రాజెక్ట్‌’ అనేది స్టూడెంట్స్‌ కోసం రూపొందించిన సోషల్‌–ఎమోషనల్‌ లెర్నింగ్‌ యాక్టివిటీ. రాయడం, రంగులు వేయడం... మొదలైన ప్రక్రియల ద్వారా సానుభూతి, దయాగుణాలకు సంబంధించి మార్గనిర్దేశం చేస్తుంది.

→ కైండ్‌నెస్‌ క్విల్ట్‌ అనేది సింగిల్‌–పేజీ ప్రింటబుల్‌ వర్క్‌షీట్‌ జు ‘దయ అంటే ఏమిటి? ‘దయ ప్రాముఖ్యత ఏమిటి?’  ‘దయాగుణాన్ని ఎలా చూపించవచ్చు?’...ఇలాంటి ప్రాంప్ట్‌లు కైండ్‌నెస్‌ క్విల్ట్‌లో రాయాలి.

→ క్విల్ట్‌ స్క్వేర్‌ను ఆకర్షణీయమై రంగులతో డిజైన్‌ చేయాలి జు కైండ్‌నెస్‌ క్విల్ట్‌లను క్లాస్‌రూమ్‌లో డెకరేట్‌ చేయాలి. చిత్రాల రూపంలో ‘మై కైండ్‌ నెస్‌ ఇన్‌ యాక్షన్‌’ ‘ఫిల్‌ ఏ కప్‌ విత్‌ కైండ్‌నెస్‌’ ‘కైండ్‌నెస్‌ వీల్‌ యాక్టివిటీ’ ‘కైండ్‌ అండ్‌ అన్‌ కైండింగ్‌ యాక్టివిటీ’... మొదలైన క్లాస్‌రూమ్‌ యాక్టివిటీలు ఎన్నో ఉన్నాయి.

మై కైండ్‌నెస్‌ ఇన్‌ యాక్షన్‌ ఫ్లవర్‌
‘మై కైండ్‌నెస్‌ ఇన్‌ యాక్షన్‌ ఫ్లవర్‌’లాంటి వర్క్‌షీట్‌లు పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తాయి. దీన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే...‘మై కైండ్‌నెస్‌ ఇన్‌ యాక్షన్‌’ పేరుతో రంగులు లేని చిత్రం ఉంటుంది, అయిదు పూలరెక్కలలో దయాగుణానికి సంబంధించి విద్యార్థులు తమ మనసులో మాట రాసి అందమైన రంగులతో పూర్తి చేయాలి. ఉదాహరణకు...ఒక రెక్కలో ఇలా రాయవచ్చు: ప్రకృతి విపత్తుల సమయంలో నేను దాచుకున్న డబ్బులను ప్రభుత్వ సహాయనిధికి విరాళంగా ఇస్తాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement