
నేడు ప్రపంచ మానవత్వ దినోత్సవం
మానవ సేవే మాధవ సేవ అంటారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని, ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, యుద్ధాలు,అంటువ్యాధుల వంటి ప్రమాదకరమైన పరిస్థితులలో మానవ సేవలో ధన్యులయిన వారిని స్మరించుకోవడం కోసం 2009 నుండి ఆగస్టు 19 నాడు ‘ప్రపంచ మానవత్వ దినోత్సవా’ (world humanitarian day )న్ని జరుపుకొంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ తేదీనే ఎంచుకోడానికి కారణం... బ్రెజిల్ దేశానికి చెందిన సెర్గియోడిమెల్లో. ఆయన దాదాపు మూడున్నర దశాబ్దాల పాటూ ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) మానవతా వాద సహాయ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేశారు. చాలా దేశాల్లో యుద్ధాల మధ్య యూఎన్‌ఓ సహాయ కార్యక్రమాలు చేపట్టిన ఆయన... 2003 ఆగస్టు 19న ఇరాక్‌లోని ఒక బాంబు పేలుడులో 21 మంది సహచరులతో సహా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి యూఎన్‌ఓ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
ఈ ఏడాది ‘ప్రపంచ ఐక్యతను బలోపేతం చేయడం, స్థానిక సమాజాలకు సాధికారత కల్పించడం’ అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలో వందలాది మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నిత్యం అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫ్రికా ఖండంలోని సోమాలియా వంటి దేశాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల వల్ల ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మానవత్వంతో, సహనంతో వ్యవహరించాలి. దయనీయ స్థితిలో కూరుకుపోయిన వారికి సహాయం అందించి ఆదుకోవాలి. ఏ సమాజంలోనైనా భిన్న నమ్మ కాలు, విభిన్న తాత్విక దృక్పథాలు ఉంటాయి. వాటిమధ్య సహజీవన సౌగంధాన్ని సాధించినప్పుడే శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. సహనం సామా జిక శాంతికి కారణమవుతుంది. మనిషిలోని అసహనం సమాజంలోని అల్ల కల్లోలాకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పనిసరి.
ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు
– ఎం. రాం ప్రదీప్ ‘ జన విజ్ఞాన వేదిక, తిరువూరు