ఆ కారు రిజిస్ట్రేషన్కే రూ. 1.6 కోట్లు!! | mukesh ambani spends rs 1.6 crores for car registration | Sakshi
Sakshi News home page

ఆ కారు రిజిస్ట్రేషన్కే రూ. 1.6 కోట్లు!!

May 20 2015 10:53 AM | Updated on Apr 3 2019 4:59 PM

ఆ కారు రిజిస్ట్రేషన్కే రూ. 1.6 కోట్లు!! - Sakshi

ఆ కారు రిజిస్ట్రేషన్కే రూ. 1.6 కోట్లు!!

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలో ఓ కారు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ ఫీజుగానే ఆయన చెల్లించిన మొత్తం అక్షరాలా.. రూ. 1.6 కోట్లు!!

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలో ఓ కారు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ ఫీజుగానే ఆయన చెల్లించిన మొత్తం అక్షరాలా.. రూ. 1.6 కోట్లు!! బీఎండబ్ల్యు 7 సిరీస్ కారును ఆయన ఇటీవలే కొనుగోలు చేశారు. సాధారణంగా తాము నిబంధనల ప్రకారం వాహనం విలువలో 20 శాతం మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేస్తామని ఆ శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఆ లెక్కన ఆ కారు విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు. అయితే అది కేవలం కారు ఖర్చు మాత్రమే కాకపోవచ్చని, దానికి చేసిన ఇతర హంగుల వల్ల కూడా ఆ ఖరీదు పెరిగి ఉండొచ్చని అంటున్నారు.

ఈ బీఎండబ్ల్యు కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. దాని ఛాసిస్తో పాటు అద్దాల మీద కూడా ఎలాంటి ఆయుధాల దాడి ప్రభావం ఏమాత్రం ఉండబోదు. వాస్తవానికి అంబానీ కొన్న బీఎండబ్ల్యు 760ఐ కారు ఖరీదు రూ. 1.9 కోట్లు మాత్రమే. కానీ దానికి జర్మనీలో చేయించిన బుల్లెట్ప్రూఫ్.. ఇతర సదుపాయాలు అన్నీ కలిపి దాని విలువ రూ. 8.5 కోట్లు అయ్యిందని, అందుకే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెరిగిందని చెబుతున్నారు. ఈ కారును ప్రత్యేకంగా జర్మనీలో ఆర్డర్ చేసి తయారుచేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement