సురేష్ షెట్కార్కు దిగ్విజయ్ బుజ్జగింపు | medak congress leaders meet digvijay singh | Sakshi
Sakshi News home page

సురేష్ షెట్కార్కు దిగ్విజయ్ బుజ్జగింపు

Oct 20 2015 4:35 PM | Updated on Oct 16 2018 3:15 PM

సురేష్ షెట్కార్కు దిగ్విజయ్ బుజ్జగింపు - Sakshi

సురేష్ షెట్కార్కు దిగ్విజయ్ బుజ్జగింపు

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారు.

హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారు. దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్రెడ్డికి టికెట్ ఇవ్వాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సూచించగా.. టికెట్ తనకే కావాలని మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సురేష్ షెట్కార్ను బుజ్జగించి.. ఉప ఎన్నిక బాధ్యతలను చేపట్టాలని సూచించారు.

మంగళవారం గాంధీభవన్లో దిగ్విజయ్తో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. నారాయణ్ఖేడ్ ఉప ఎన్నిక గురించి చర్చించారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 29న నారాయణ్ఖేడ్లో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ఇదిలావుండగా పీసీసీలో పని విభజన లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్కు ఫిర్యాదు చేశారు. పీసీసీ పాత కార్యవర్గం ఉందో లేదో స్పష్టత ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement