హైవేపై లారీలో మంటలు | lorry catches fire mishap at vizag fort high way | Sakshi
Sakshi News home page

హైవేపై లారీలో మంటలు

Aug 29 2015 9:03 AM | Updated on Sep 3 2017 8:21 AM

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామ సమీపంలో బొగ్గుతో వెళుతున్న ఓ లారీ మంటల్లో చిక్కుకుంది.

ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామ సమీపంలో బొగ్గుతో వెళుతున్న ఓ లారీ మంటల్లో చిక్కుకుంది. విశాఖపట్నం పోర్ట్ నుంచి బొగ్గుతో వస్తుండగా లారీలో ఒక్కసారిగా మంటలు లేచాయి. లారీని వెంటనే ఆపి డ్రైవర్, క్లీనర్ కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమచారంతో అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో లారీ స్వల్పంగా దగ్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement