లెనోవో కే5 నోట్ భారత్ లోకి వచ్చేస్తుందోచ్! | Lenovo K5 Note India Launch Set for August | Sakshi
Sakshi News home page

లెనోవో కే5 నోట్ భారత్ లోకి వచ్చేస్తుందోచ్!

Jul 18 2016 6:27 PM | Updated on Sep 4 2017 5:16 AM

లెనోవో కే5 నోట్ భారత్ లోకి వచ్చేస్తుందోచ్!

లెనోవో కే5 నోట్ భారత్ లోకి వచ్చేస్తుందోచ్!

వైబ్ కే4 నోట్ స్మార్ట్ ఫోన్ విజయంతో మంచి ఊపు మీద ఉన్న లెనోవో, తన కొత్త స్మార్ట్ ఫోన్ కే5 నోట్ లాంచింగ్ కు సిద్ధమైంది.

వైబ్ కే4 నోట్ స్మార్ట్ ఫోన్ విజయంతో మంచి ఊపు మీద ఉన్న లెనోవో, తన కొత్త స్మార్ట్ ఫోన్ కే5 నోట్ లాంచింగ్ కు సిద్ధమైంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం లెనోవో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచింగ్ గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. బుకింగ్స్ అయిపోతాయని యూజర్లు చింతించాల్సినవసరం లేదని, సరిపడ నోట్5 లు అందుబాటులో ఉంటాయని తెలిపేందుకు సరదా ట్వీట్ ను కంపెనీ పోస్టు చేసింది. ఫైనల్ గా ఆగస్టు 20న నోట్ 5ను యూజర్ల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధంచేసింది.  వైబ్ కే4 నోట్ ను విడుదల చేసిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ ఫోన్ ను లెనోవో తీసుకొస్తోంది. ఈ ఫోన్ కు సంబంధించిన మొదటి టీజర్ ను బుధవారం విడుదలచేయనున్నట్టు లెనోవో ఇండియా క్లారిటీ ఇచ్చింది. కే4 నోట్ లో చాలా మెరుగుదలతో కే5 నోట్ ను భారత యూజర్ల ముందుకు తీసుకురాబోతుంది. లెనోవో కే5 నోట్ ను చైనాలో ఆవిష్కరించిన కొన్ని వారాల్లోనే వైబ్ కే4 నోట్ ను భారత్ లో ఆవిష్కరించి యూజర్లను ఆశ్చర్యపరిచింది.


లెనోవో కే5 నోట్ ఫీచర్లు...
5.50 అంగుళాల డిస్ ప్లే
1.8గిగాహెడ్జ్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్స్
2జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
128 జీబీ విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్
ఫింగర్ ప్రింట్ సెన్సార్
మెటల్ బాడీ
డ్యూయల్ సిమ్
4జీ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ
3500ఎంఏహెచ్

Advertisement
Advertisement