‘ఆయన నుంచి విడాకులు కావాలి’ | Indrani seeks divorce from Peter Mukerjea | Sakshi
Sakshi News home page

‘ఆయన నుంచి విడాకులు కావాలి’

Jan 17 2017 5:09 PM | Updated on Sep 5 2017 1:26 AM

‘ఆయన నుంచి విడాకులు కావాలి’

‘ఆయన నుంచి విడాకులు కావాలి’

షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు.

ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియా నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. విడాకులకు దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనికి ట్రయల్ కోర్టు అనుమతి అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. షీనా బోరా హత్య కేసులో తనను పీటర్ ఇరికించారని భావిస్తున్న ఇంద్రాణియా ఆయన నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అంతకుముందు ఆమె తన మొదటి నుంచి సంజీవ్‌ ఖన్నా నుంచి విడిపోయారు. తర్వాత మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జియాను పెళ్లాడారు. పీటర్, మాజీ భర్తతో కలసి సొంత కూతురు షీనా బోరాను హత్య  చేసినట్టు ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం చార్జిషీటు దాఖలైంది. ఫిబ్రవరి 1 నుంచి కోర్టులో విచారణ మొదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement