ఇండిగో మూడు రోజుల సమ్మర్‌ సేల్‌ | IndiGo launches 3-day sale, fares starting as low as Rs 899 | Sakshi
Sakshi News home page

ఇండిగో మూడు రోజుల సమ్మర్‌ సేల్‌

May 8 2017 6:38 PM | Updated on Sep 5 2017 10:42 AM

తక్కువ ధరల క్యారియర్‌ ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ సోమవారం తక్కువ ధరల్లో విమాన​ టికెట్లను ప్రకటించింది.

న్యూఢిల్లీ: తక్కువ ధరల క్యారియర్‌ ఇండిగో ఎయిర్‌ లైన్స్‌  సోమవారం  తక్కువ ధరల్లో విమాన​ టికెట్లను  ప్రకటించింది. తన నెట్‌వర్క్‌ అంతటా  మూడు రోజుల సమ‍్మర్‌ స్పెషల్‌  సేల్‌ను ప్రవేశపెట్టింది. మే 8, 9, 10 తేదీల్లో డిస్కౌంట్‌ ధరల్లో   ఇండిగో విమాన టికెట్లు అందుబాటులో ఉంటాయి. అన్నీ కలుపుకొని రూ. 899 ధరల్లో వివిధ మార్గాల్లో ఈ టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.  

నేటినుంచి ఎంపిక చేసిన మార్గాల్లో మూడు రోజుల పాటు వేసవి విక్రయాలను ప్రారంభించినట్టు  ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై-గోవా, అహ్మదాబాద్-ముంబై, చెన్నై-పోర్ట్ బ్లెయిర్, గౌహతి-హైదరాబాద్, ముంబై-గువహతి, జమ్ము-అమృత్సర్, ఢిల్లీ-ఉదయపూర్, కోల్‌కతా-అగర్తల  సహా  ఇతర మార్గాల్లో  ఇవి అందుబాటులో ఉంటాయి.  ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ విధానంలో టికెట్లను  కేటాయించ నున్నామని  ఇండిగో తెలిపింది.  అలాగే  ఈ  స్పెషల్‌  సేల్‌ లో కొన్న టికెట్లకు  రిఫండ్‌ ఉండదని స్పష్టం  చేసింది. ఇండిగో ఎయిర్పోస్ ఎ320  విమానాల ద్వారా 46 గమ్యస్థానాలకు 932 రోజువారీ విమానాలు నడుపుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement