షరీఫ్ గద్దె దిగిపో: ఇమ్రాన్ ఖాన్ | Imran Khan asks Nawaz Sharif to resign for a month | Sakshi
Sakshi News home page

షరీఫ్ గద్దె దిగిపో: ఇమ్రాన్ ఖాన్

Aug 24 2014 2:03 PM | Updated on Mar 23 2019 8:32 PM

షరీఫ్ గద్దె దిగిపో: ఇమ్రాన్ ఖాన్ - Sakshi

షరీఫ్ గద్దె దిగిపో: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వెంటనే గద్దె దిగిపోవాలని పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వెంటనే గద్దె దిగిపోవాలని పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ కేసు విచారణ జరుగుతున్నందున్న పదవి నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్ సూచించారు. 
 
షరీఫ్ రాజీనామాపై ప్రభుత్వంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మూడో దఫా జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొందని ఓ ప్రతిక కథనాన్ని వెల్లడించింది. ఇస్లామాబాద్ లో నిర్వహించిన ఓ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. షరీఫ్ రాజీనామా సమర్పించి.. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement