సెల్ఫీ పేరిట అసభ్య ప్రవర్తన.. నటి ఆగ్రహం! | Furious actress slams man for misbehaving | Sakshi
Sakshi News home page

సెల్ఫీ పేరిట అసభ్య ప్రవర్తన.. నటి ఆగ్రహం!

Mar 14 2017 3:24 PM | Updated on Sep 5 2017 6:04 AM

సెల్ఫీ పేరిట అసభ్య ప్రవర్తన.. నటి ఆగ్రహం!

సెల్ఫీ పేరిట అసభ్య ప్రవర్తన.. నటి ఆగ్రహం!

కోల్‌కతాలో విమానాశ్రయంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.

కోల్‌కతాలో విమానాశ్రయంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. సెల్ఫీ పేరిట దురుసుగా వ్యవహరించిన అతని తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తాజా చిత్రం ’బేగం జాన్‌’  ప్రమోషన్‌లో భాగంగా బిజీగా ఉన్న విద్యా బాలన్‌ కోల్‌కతా విమానాశ్రయంలో ఉండగా ఈ ఘటన జరిగింది.

ఆ సమయంలో ఓ వ్యక్తి తనతో సెల్ఫీ దిగాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె ఒప్పుకుంది కూడా. అయితే, సరిగ్గా మొబైల్‌ఫోన్‌తో సెల్ఫీ క్లిక్‌ చేసే సమయంలో ఆమె చుట్టూ చేయి వేసి వికృతబుద్ధి బయటపెట్టుకున్నాడు. చుట్టూ చేయి వేయడంతో కంగుతిన్న ఆమె అతని తీరును తీవ్రంగా వారించింది. అయినా అతను ఫొటోలు తీస్తూ ఉండటంతో సహనం కోల్పోయిన ఆమె ఆ వ్యక్తిపై తీవ్రంగా మండిపడింది. ’అసలు ఏం చేస్తున్నావు. సక్రమంగా ప్రవర్తించడం తెలియదా?’ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఈ ఘటన గురించి విద్యాబాలన్‌ స్పందిస్తూ..’ఓ అగంతకుడు మీ చుట్టూ చేతులు వేస్తే.. పురుషులైనా, మహిళలైనా అసౌకర్యంగా భావిస్తారు. అది వ్యక్తిగత పరిధిలోకి చొరబడటమే అవుతుంది. మేం పబ్లిక్‌ ఫిగర్లమే కానీ పబ్లిక్‌ ప్రాపర్టీ కాదు’ అని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement