విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆంధ్రా మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబరు 28 నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు..
విజయవాడ: విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆంధ్రా మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబరు 28 నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించనున్నట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగం చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్‌కు చెందిన ఎనిమిది మంది సర్జన్‌ల బృందం ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
బుధవారం ఆయన గవర్నర్‌పేటలోని ఆస్పత్రి ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న 18 ఏళ్లలోపు చిన్నారులు తమను సంప్రదించాలని సూచించారు. తొలుత వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి, వారం రోజుల్లో నిర్వహించనున్నటు తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ 94946 06677, 94942 54206ను సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.