కొడుకును కొట్టి చంపిన తండ్రి | Father beats son to death | Sakshi
Sakshi News home page

కొడుకును కొట్టి చంపిన తండ్రి

Apr 12 2014 6:00 PM | Updated on Aug 16 2018 4:36 PM

పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతుంటే ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? ఏదో ఒక పని చూసుకొమ్మని చెప్పినందుకు తన కన్న కొడుకును కొట్టి చంపాడో తండ్రి.

పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతుంటే ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? ఏదో ఒక పని చూసుకొమ్మని చెప్పినందుకు తన కన్న కొడుకును కొట్టి చంపాడో తండ్రి. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగింది. దక్షిణ ఢిల్లీలోని డబ్రి ప్రాంతంలో 21 ఏళ్ల వివేక్ రక్తపు మడుగులో పడి ఉండగా పొరుగున ఉండే మరో వ్య్తక్తి చూసి.. పోలీసులకు తెలిపాడు.

వెంటనే వివేక్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. వివేక్ తండ్రి కుల్దీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే తన కొడుకు తనను కూడా ఏదో ఒక పనిచేసి సంపాదన చూసుకోవాల్సిందిగా పదే పదే ఒత్తిడి చేస్తున్నాడని, దాంతో తాను అసంతృప్తిగా ఉన్నానని అతడు పోలీసులకు చెప్పాడు. కుల్దీప్ను అరెస్టు చేశామని, కొడుకును చావబాదిన ఇనుప రాడ్ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement