'25 వేల ఆహార పొట్లాలు పంపిస్తాం' | DSGMC, SGPC to send 25,000 food packets every day to Kathmandu | Sakshi
Sakshi News home page

'25 వేల ఆహార పొట్లాలు పంపిస్తాం'

Apr 26 2015 5:34 PM | Updated on Oct 20 2018 6:37 PM

'25 వేల ఆహార పొట్లాలు పంపిస్తాం' - Sakshi

'25 వేల ఆహార పొట్లాలు పంపిస్తాం'

నేపాల్ భూకంప బాధితులకు తమ వంతు సహాయం అందించేందుకు సిక్కు మత సంస్థలు ముందుకు వచ్చాయి.

ఛండీగఢ్: నేపాల్ భూకంప బాధితులకు తమ వంతు సహాయం అందించేందుకు సిక్కు మత సంస్థలు ముందుకు వచ్చాయి. భూకంప బాధితుల కోసం రోజుకు 25 వేల ఆహార పొట్లాలు పంపించాలని నిర్ణయించాయి.

సోమవారం నుంచి కఠ్మాండుకు రోజుకు 25 వేల ఆహార పొట్లాలు పంపిస్తామని శిరోమణి గురుద్వారా ప్రబందక్ కమిటీ(ఎస్ జీపీసీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజింగ్ కమిటీ(డీఎస్జీఎంసీ) ప్రకటించాయి. శిరోమణి అకాలీదళ్(ఎస్ ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ ఆదేశాలకు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement