అమెరికన్ సీఈవోలకు ట్రంప్ గట్టి వార్నింగ్! | Donald Trump warns American CEOs of huge border tax if they shift jobs abroad | Sakshi
Sakshi News home page

అమెరికన్ సీఈవోలకు ట్రంప్ గట్టి వార్నింగ్!

Jan 24 2017 4:40 PM | Updated on Aug 25 2018 7:50 PM

అమెరికన్ సీఈవోలకు ట్రంప్ గట్టి వార్నింగ్! - Sakshi

అమెరికన్ సీఈవోలకు ట్రంప్ గట్టి వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిజినెస్ లీడర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిజినెస్ లీడర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలు ఒకవేళ ఉద్యోగాలను విదేశాలకు తరలించాలనుకుంటే, భారీ మొత్తంలో సరిహద్దు పన్నును చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా అమెరికాలోనే ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేస్తూ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. కంపెనీలను ప్రోత్సహించడానికి భారీమొత్తంలో పన్ను కోత, నిబంధనల్లో వెసులుబాటు కల్పించనున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన 12 మంది టాప్ బిజినెస్ లీడర్లతో సోమవారం ట్రంప్ వైట్హౌస్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో వారికి ఈ హెచ్చరికలు జారీచేసినట్టు తెలిసింది.
 
మ్యానుఫాక్చరింగ్ అనేది తిరిగి అమెరికా స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ట్రంప్ బిజినెస్ లీడర్లకు పిలుపునిచ్చారు. ఒకవేళ విదేశాలకు ఉద్యోగాలు తరలిస్తే, తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ''ఇక్కడ ప్రజలను దూషిస్తూ.. వేరే ప్రాంతంలో ఫ్యాక్టరీని నెలకొల్పి, అమెరికాలోకి ఉత్పత్తులను తరలించాలనుకుంటే కుదరదు. దానికి అవసరమైన సరిహద్దు పన్నును కంపెనీలు చెల్లించాల్సిందే '' అని బిజినెస్ లీడర్ల భేటీలో ట్రంప్ పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement