breaking news
border tax
-
అమెరికన్ సీఈవోలకు ట్రంప్ గట్టి వార్నింగ్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిజినెస్ లీడర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలు ఒకవేళ ఉద్యోగాలను విదేశాలకు తరలించాలనుకుంటే, భారీ మొత్తంలో సరిహద్దు పన్నును చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా అమెరికాలోనే ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేస్తూ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. కంపెనీలను ప్రోత్సహించడానికి భారీమొత్తంలో పన్ను కోత, నిబంధనల్లో వెసులుబాటు కల్పించనున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన 12 మంది టాప్ బిజినెస్ లీడర్లతో సోమవారం ట్రంప్ వైట్‌హౌస్‌లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో వారికి ఈ హెచ్చరికలు జారీచేసినట్టు తెలిసింది. మ్యానుఫాక్చరింగ్ అనేది తిరిగి అమెరికా స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ట్రంప్ బిజినెస్ లీడర్లకు పిలుపునిచ్చారు. ఒకవేళ విదేశాలకు ఉద్యోగాలు తరలిస్తే, తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ''ఇక్కడ ప్రజలను దూషిస్తూ.. వేరే ప్రాంతంలో ఫ్యాక్టరీని నెలకొల్పి, అమెరికాలోకి ఉత్పత్తులను తరలించాలనుకుంటే కుదరదు. దానికి అవసరమైన సరిహద్దు పన్నును కంపెనీలు చెల్లించాల్సిందే '' అని బిజినెస్ లీడర్ల భేటీలో ట్రంప్ పేర్కొన్నారు. -
సరిహద్దు పన్నును ఎత్తి వేయాలి
దోమలగూడ: వాహనాలపై సరిహద్దు పన్నును ఎత్తి వేయాలని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు అన్నారు. సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లురవి మాట్లాడుతూ ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చర్చలు, సంప్రదింపులతో సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థి తి లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారన్నారు. సరిహద్దు పన్ను కారణంగా రవాణా, టూరిస్టు ఆపరేటర్లపై అదనపు భారం పడుతోందన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సరిహద్దు పన్ను సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. అధ్యక్షులు గుంటోజు భీష్మాచారి, ప్రధానకార్యదర్శి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు పన్ను ద్వారా ఇరు రాష్ట్రాల్లోని రవాణా, ట్రావెల్ ఆపరేటర్లు, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెసు అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్, నాయకులు శ్రీనివాసు, శ్రీనివాసు, నాగేశ్వర్రావు, జంగయ్య, పర్వతాలు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.