సరిహద్దు పన్నును ఎత్తి వేయాలి | Border tolls should be lifted | Sakshi
Sakshi News home page

సరిహద్దు పన్నును ఎత్తి వేయాలి

Jul 26 2016 12:17 AM | Updated on Sep 4 2017 6:14 AM

వాహనాలపై సరిహద్దు పన్నును ఎత్తి వేయాలని తెలంగాణ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు అన్నారు.

దోమలగూడ: వాహనాలపై సరిహద్దు పన్నును ఎత్తి వేయాలని తెలంగాణ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు అన్నారు. సోమవారం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లురవి మాట్లాడుతూ ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చర్చలు, సంప్రదింపులతో సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థి తి లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలాగా వ్యవహరిస్తున్నారన్నారు. సరిహద్దు పన్ను కారణంగా రవాణా, టూరిస్టు ఆపరేటర్లపై అదనపు భారం పడుతోందన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సరిహద్దు పన్ను సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. అధ్యక్షులు గుంటోజు భీష్మాచారి, ప్రధానకార్యదర్శి గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు పన్ను ద్వారా ఇరు రాష్ట్రాల్లోని రవాణా, ట్రావెల్‌ ఆపరేటర్లు, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెసు అధ్యక్షులు అనిల్‌కుమార్‌ యాదవ్, నాయకులు శ్రీనివాసు, శ్రీనివాసు, నాగేశ్వర్‌రావు, జంగయ్య, పర్వతాలు, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement