నిత్యావసర ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ధర్నా | Congress to protest hike of Commodity prices | Sakshi
Sakshi News home page

నిత్యావసర ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ధర్నా

Aug 26 2015 11:54 AM | Updated on Mar 18 2019 7:55 PM

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఖైరతాబాద్లో బుధవారం పౌరసరఫరాల భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది.

హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఖైరతాబాద్లో బుధవారం పౌరసరఫరాల భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి మండిపడ్డారు. సామాన్యులకు నిత్యావసర ధరలు అందుబాటులో లేవని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement