టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్య | Congress leader commits suicide after being denied poll ticket in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్య

Nov 7 2013 5:22 PM | Updated on Mar 18 2019 7:55 PM

శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదనే ఆవేదనతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు ఆత్మహత్య చేసుకున్నారు.

షాజాపూర్: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదనే ఆవేదనతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు ఆత్మహత్య చేసుకున్నారు.  షాజాపూర్ జిల్లాలోని ఆగార్ నియోజకవర్గ టికెట్ ఆశించిన నర్సింగ్ మాలవియా(40) ఈ ఉదయం తన నివాసం వద్ద విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయనను ఉజ్జయిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ సింగ్ వర్మ మద్దతుదారుడయిన నర్సింగ్ జిల్లా కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో నిరాశకు లోనయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement