నెలన్నర పాటు విద్యార్థినిపై పోలీసుల గ్యాంగ్ రేప్ | Chandigarh rape case: Fifth accused cop arrested | Sakshi
Sakshi News home page

నెలన్నర పాటు విద్యార్థినిపై పోలీసుల గ్యాంగ్ రేప్

Dec 21 2013 8:33 PM | Updated on Sep 2 2017 1:50 AM

నెలన్నర పాటు విద్యార్థినిపై పోలీసుల గ్యాంగ్ రేప్

నెలన్నర పాటు విద్యార్థినిపై పోలీసుల గ్యాంగ్ రేప్

చంఢీగఢ్లో పదవ తరగతి విద్యార్థినిని దాదాపు నెలన్నరపాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన కీచక పోలీసుల్ని అరెస్ట్ చేశారు.

చంఢీగఢ్లో పదో తరగతి విద్యార్థినిని దాదాపు నెలన్నరపాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా వాళ్లూ వీళ్లూ కారు.. పోలీసులు! ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు!! మొత్తం ఐదుగురినీ ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసు కానిస్టేబుళ్లంతా కూడా లాహోర గ్రామానికి చెందినవారు. వీరిపై సస్పెన్షన్ వేటు పడింది.

తనను ఐదుగురు పోలీసు కానిస్టేబుళ్లు కిడ్నాప్ చేసి, దాదాపు ఆరు వారాల పాటు సామూహిక అత్యాచారం చేసినట్లు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని చంఢీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు సహకరించకపోతే చంపేస్తామని తుపాకులతో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడేవారిని ఆమె తెలిపింది.

ఎట్టకేలకు కీచకుల  కళ్లుగప్పి ఇంటికి చేరుకున్న విద్యార్థిని.. జరిగిన ఘాతుకాన్ని తన తల్లితండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. విచారణ జరిపిన అధికారులు కానిస్టేబుళ్లపై కేసు నుమోదు చేసి,  పరారైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అత్యాచార ఘటన బయటకు పొక్కడంతో చండీగఢ్ నగర ప్రజలు, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు నిరసనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement