సీఎం కాన్వాయ్ పై రాళ్లు రువ్విన బీజేపీ కార్యకర్తలు | BJP workers hurl stones at CM's car | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్ పై రాళ్లు రువ్విన బీజేపీ కార్యకర్తలు

Nov 28 2014 9:34 PM | Updated on Sep 2 2017 5:17 PM

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం రాళ్లు రువ్వారు.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం రాళ్లు రువ్వారు. నైనిటాల్ జిల్లాలోని హల్దవానీలో ఓ కుటుంబాన్ని పరామర్శించి తిరిగొస్తుండగా సీఎం కాన్వాయ్ పై బీజేపీ కార్యక్తలు ఈ దాడికి పాల్పడ్డారు. వారు విసిరిన రాళ్లు సీఎం ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దానికి తగిలాయి. హరీష్ రావత్ కారు ముందు సీటులో కూర్చోవడంతో ఆయన ఎటువంటి గాయాలు కాలేదని ఏడీజీ రాంసింగ్ మీనా తెలిపారు.

రాళ్లు రువ్విన నలుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నట్ట చెప్పారు. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో బాధిత కుటుంబాన్ని రావత్ అంతకుముందు పరామర్శించారు. దోషులను చట్టప్రకారం శిక్షిస్తామని హామీయిచ్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏడీజీ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement