నావల్ల బ్యాంక్కు అప్రతిష్ట.. క్షమించండి | Bank boss apologizes to 75,000 staff over alleged affair | Sakshi
Sakshi News home page

నావల్ల బ్యాంక్కు అప్రతిష్ట.. క్షమించండి

Aug 24 2016 7:54 PM | Updated on Sep 4 2017 10:43 AM

బ్రిటన్లో పెద్ద బ్యాంక్ అయిన లియోడ్స్ బ్యాంకింగ్ గ్రూపు (ఎల్వైజీ) సీఈవో ఆంటోనియా హోర్టా-ఒసొరియా.. 75వేల మంది బ్యాంక్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు.

బ్రిటన్లో పెద్ద బ్యాంక్ అయిన లియోడ్స్ బ్యాంకింగ్ గ్రూపు (ఎల్వైజీ) సీఈవో ఆంటోనియా హోర్టా-ఒసొరియా.. 75వేల మంది ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. ఓ మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు రావడమే దీనికి కారణం.

ఇటీవల సింగపూర్కు బిజినెస్ టూర్కు వెళ్లినపుడు హోర్టా-ఒసొరియా ఓ మహిళతో గడిపినట్టు ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఫొటోలు కూడా మీడియాలో ప్రచురితమయ్యాయి. దీనిపై ఆయన స్పందిస్తూ బ్యాంక్కు అప్రతిష్ట వచ్చినందుకు క్షమించాలని కోరుతూ బ్యాంక్ సిబ్బందికి లేఖ పంపారు. 'వ్యక్తిగత జీవితం ప్రైవేట్ విషయం. అయితే నా వల్ల ప్రతికూల ప్రచారం వచ్చింది. గ్రూపు పేరుప్రతిష్టలకు మచ్చతెచ్చింది' అని  హోర్టా-ఒసొరియా చెప్పారు. లియోడ్స్ బ్యాంకింగ్ గ్రూపు (ఎల్వైజీ) సీఈవో పదవి నుంచి వైదొలగబోనని ఉద్యోగులకు, వినియోగదారులకు స్పష్టం చేశారు. 2011లో ఆయన ఈ బ్యాంకు సీఈవోగా నియమితులయ్యారు.

Advertisement

పోల్

Advertisement