యాక్సిస్ బ్యాంక్ | Axis Bank's retail 17 %deposits | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్

Oct 21 2013 1:08 AM | Updated on Sep 1 2017 11:49 PM

బ్రాంచీల విస్తరణ, పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండడం తదితర కారణాల వల్ల రిటైల్, ఎస్‌ఎంఈ రంగ రుణాలు బాగా అభివృద్ధి చెందాయి.

 ఎందుకు కొనొచ్చంటే: బ్రాంచీల విస్తరణ, పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండడం తదితర కారణాల వల్ల రిటైల్, ఎస్‌ఎంఈ రంగ రుణాలు బాగా అభివృద్ధి చెందాయి.  కార్పొరేట్ రుణాలు కూడా ఓ మోస్తరుగా వృద్ధి చెందాయి. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రుణ వృద్ధి 17 శాతంగా ఉంది. ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఈ వృద్ధి 15-16 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ.5,500 కోట్ల నిధుల్లో కొంత భాగాన్ని రుణ విస్తరణకు వినియోగించింది.
 
  రిటైల్ టెర్మ్ డిపాజిట్లు 17 శాతం,  సేవింగ్స్ డిపాజిట్లు 18% చొప్పున వృద్ధి చెందాయి. వేగవంతమైన నెట్‌వర్క్ విస్తరణ కారణంగా కాసా నిష్పత్తి మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. నికర వడ్డీ మార్జిన్లు మరింతగా పెరుగుతాయని బ్యాంక్ అంచనా వేస్తోంది. వడ్డీయేతర ఆదాయం అధికంగా ఉండడం, మార్జిన్లు జోరుగా ఉండడం, తదితర కారణాల వల్ల అధిక కేటాయింపుల అవసరాలను బ్యాంక్ తట్టుకోగలదని భావిస్తున్నాం. రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 1.6-1.7 శాతంగా ఉండొచ్చని అంచనా. 9 నెలల కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం. 
 

Advertisement
 
Advertisement
Advertisement