రూ. 7 లక్షలతో ఏటీఎం ఎత్తుకెళ్లారు | ATM machine stolen in Rudrapur | Sakshi
Sakshi News home page

రూ. 7 లక్షలతో ఏటీఎం ఎత్తుకెళ్లారు

Jun 24 2015 7:30 PM | Updated on Sep 3 2017 4:18 AM

రూ. 7 లక్షలతో ఏటీఎం ఎత్తుకెళ్లారు

రూ. 7 లక్షలతో ఏటీఎం ఎత్తుకెళ్లారు

డబ్బు కోసం ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

రుద్రపూర్: డబ్బు కోసం ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరాఖండ్  ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున దుండగులు ఈ లూటీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

అశోక్ లేలాండ్ కంపెనీ ప్రధాన గేటు వెలుపల ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకుపోయారని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా ఎస్ఎస్పీ నిలేశ్ ఆనంద్ బర్నె తెలిపారు. ఏటీఎంలో 6 నుంచి 7 లక్షల రూపాయలు ఉన్నాయని వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement