ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు! | ATM machine stolen in Delhi | Sakshi
Sakshi News home page

ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు!

Nov 25 2014 2:30 PM | Updated on Sep 2 2017 5:06 PM

ఊహాత్మక చిత్రం

ఊహాత్మక చిత్రం

ఏటీఎం సెంటర్లో చోరీ చేయాలనుకున్నారు.. కానీ కుదరలేదు. దాంతో ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు కొందరు దొంగలు.

ఏటీఎం సెంటర్లో చోరీ చేయాలనుకున్నారు.. కానీ కుదరలేదు. దాంతో ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు కొందరు దొంగలు.  సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. నరెలా ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ను ఎవరో ఎత్తుకుపోయినట్లు ఆ ఏటీఎం కేంద్రాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన స్వీపర్ తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు తెలిపారు.

వెంటనే పోలీసులు వచ్చి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూద్దామనుకున్నారు. కానీ దొంగలు బాగా తెలివైనవాళ్లు కావడంతో సీసీటీవీ కెమెరాలను కూడా ఎత్తుకుపోయారు. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న వీధిలైట్లను పగలగొట్టి, ఆ తర్వాత మిషన్ మొత్తాన్ని ఎత్తుకుపోయారని, ఆ ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ కూడా లేదని పోలీసులు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement