breaking news
atm machine stolen
-
రూ. 7 లక్షలతో ఏటీఎం ఎత్తుకెళ్లారు
రుద్రపూర్: డబ్బు కోసం ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున దుండగులు ఈ లూటీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అశోక్ లేలాండ్ కంపెనీ ప్రధాన గేటు వెలుపల ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకుపోయారని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా ఎస్ఎస్పీ నిలేశ్ ఆనంద్ బర్నె తెలిపారు. ఏటీఎంలో 6 నుంచి 7 లక్షల రూపాయలు ఉన్నాయని వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు!
ఏటీఎం సెంటర్లో చోరీ చేయాలనుకున్నారు.. కానీ కుదరలేదు. దాంతో ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు కొందరు దొంగలు. సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. నరెలా ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ను ఎవరో ఎత్తుకుపోయినట్లు ఆ ఏటీఎం కేంద్రాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన స్వీపర్ తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు వచ్చి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూద్దామనుకున్నారు. కానీ దొంగలు బాగా తెలివైనవాళ్లు కావడంతో సీసీటీవీ కెమెరాలను కూడా ఎత్తుకుపోయారు. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న వీధిలైట్లను పగలగొట్టి, ఆ తర్వాత మిషన్ మొత్తాన్ని ఎత్తుకుపోయారని, ఆ ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ కూడా లేదని పోలీసులు తెలిపారు.