ఆస్పత్రిలో చేరిన అరవింద్ కేజ్రీవాల్
జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆస్పత్రిలో చేరారు.
జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆస్పత్రిలో చేరారు. గత రాత్రి అస్వస్థతకు గురికావడంతో కౌశంబీలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత వెల్లడించారు. గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఢిల్లీ పోలీసుల తీరుకు నిరసనగా 32 గంటలపాటు రైల్ భవన్ ఎదుట కేజ్రీవాల్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష సమయంలో అర్ధరాత్రి రోడ్డుపైనే నిద్రించారు.
యశోద ఆస్పత్రిలో కేజ్రివాల్ కు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. తీవ్రమైన గొంతు, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ఱారించారు. డాక్టర్ బిపిన్ మిట్లల్ పర్యవేక్షణలో కేజ్రీవాల్ కు సీటీ స్కాన్ చేశారు.