ఆపిల్ రివర్స్ గేర్ | Apple shifts into reverse on car project: report | Sakshi
Sakshi News home page

ఆపిల్ రివర్స్ గేర్

Sep 12 2016 12:49 PM | Updated on Oct 17 2018 4:36 PM

ఆపిల్ రివర్స్ గేర్ - Sakshi

ఆపిల్ రివర్స్ గేర్

ఆపిల్ కార్ల ప్రాజెక్టులోకి దూకాలా వద్దా అని తెగ మల్లగుల్లాలు పడుతుందట.

శాన్ఫ్రాన్సిస్కో : ఐఫోన్ బ్రాండ్తో వినియోగదారులకు సుపరిచితంగా మారిన ఆపిల్ కార్ల బిజినెస్లోకి అడుగుపెట్టనుందని తెగ ప్రచారం జరిగింది. గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు రూపొందిస్తున్న మాదిరిగా ఆపిల్ కూడా టైటాన్ పేరుతో కార్లను ప్రవేశపెట్టనుందని వార్తలొచ్చాయి. కానీ ప్రస్తుతం ఆపిల్ కార్ల ప్రాజెక్టులోకి దూకాలా వద్దా అని తెగ మల్లగుల్లాలు పడుతుందట. కార్ల వ్యాపారాలోకి ప్రవేశించడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కార్ల ప్రాజెక్టు చేపడుతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, దీనికోసం ఉద్యోగులను కూడా నియమించుకున్నట్టు రిపోర్టు తెలిపాయి. టైటాన్ ప్రాజెక్టు కోసం తీసుకున్న ఉద్యోగులను ప్రస్తుతం ఆపిల్ తొలగిస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం ఆటోమోటివ్ టీమ్లో పనిచేసే డజన్ల కొద్దీ ఉద్యోగులను ఆపిల్ తొలగించదని తెలుస్తోంది.  రెండు నెలల క్రితమే స్టీవ్ జాబ్స్ కాలానికి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ బాబ్ మాన్స్ఫీల్డ్ను కంపెనీ పునఃనియమించుకుంది. అదేవిధంగా బ్లాక్బెర్రీలో ఓ భాగమైన, ఆటోమేటివ్ తయారీదారుల విస్తృత పరిధి కోసం ఇన్-డ్యాష్ ఆపరేటింగ్ వ్యవస్థలను అందించడంలో విజయవంతమైన క్యూఎన్ఎక్స్ వ్యవస్థాపకుడు డాన్ డోడ్జ్ను ఆపిల్ తన కంపెనీలో నియమించుకుందని బ్లూమ్బర్గ్ తెలిపింది.  కానీ ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్టును విడిచిపెట్టడమా.. లేదా దీనిపై మరింత ఫోకస్ చేయలా అని ఆపిల్ యోచిస్తోందని రిపోర్టులు తెలుపుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఆపిల్ షేర్లు 2 శాతం పడిపోయి 103.13 డాలర్లుగా నమోదయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement