ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయ్! | all banks working on 10th october, clarified by banking association | Sakshi
Sakshi News home page

ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయ్!

Sep 26 2016 5:55 PM | Updated on Apr 8 2019 8:07 PM

ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయ్! - Sakshi

ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయ్!

బ్యాంకుల పనిదినాలపై ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది.

బ్యాంకుల పనిదినాలపై ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది. వచ్చే నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో 2016 అక్టోబర్ 10వ తేదీని బ్యాంకులు పని చేయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది. అక్టోంబర్ 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం, 10న ఆయుధ పూజ, 11న విజయదశమి, 12న మొహర్రం పండుగల కావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
 
అయితే వరుసగా మూడు రోజుల మినహా ఎక్కువ రోజులు బ్యాంకులు సెలవులు పాటించకూడదనే నిబంధనతో ఆ రోజుల్లో ఒకరోజు పనిదినాన్ని పాటించాలని బ్యాంకులు నిర్ణయించాయి. అక్టోబర్ 10 ఆయుధ పూజ రోజున బ్యాంకులు పనిచేయనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement