వామ్మో దుప్పి.. శరవేగంగా బైకర్‌పై జంప్‌! | a deer jumping over biker to cross a road | Sakshi
Sakshi News home page

వామ్మో దుప్పి.. శరవేగంగా బైకర్‌పై జంప్‌!

Published Mon, Apr 3 2017 3:20 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

వామ్మో దుప్పి.. శరవేగంగా బైకర్‌పై జంప్‌!

వామ్మో దుప్పి.. శరవేగంగా బైకర్‌పై జంప్‌!

మనుషులు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అడవుల్లోని జంతువులు వారికి తారసపడటం.. ఎదురుపడటం అప్పుడప్పుడు జరుగుతూ ఉండేదే.

మనుషులు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అడవుల్లోని జంతువులు వారికి తారసపడటం.. ఎదురుపడటం అప్పుడప్పుడు జరుగుతూ ఉండేదే. కానీ అరుదైన రీతిలో ఓ భారీ దుప్పి శరవేగంగా దూసుకొచ్చి.. వేగంగా వెళుతున్న బైకర్‌ మీద నుంచి దూకేసింది. వర్జినీయాలోని అలెగ్జాండ్రియాలో ఒక బృందంపై బైకులపై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైకర్లు వేగంగా దూసుకెళుతున్న తరుణంలో ఓ భారీ దుప్పి రోడ్డును క్రాస్‌ చేసేందుకు ప్రయత్నించింది.

బైకులు వేగంగా వెళుతున్నా.. తనదైన శైలిలో బైకులపై నుంచి శరవేగంగా దుప్పి జంప్‌ కొట్టి రోడ్డు దాటింది. ఇలా జంప్‌ చేసే క్రమంలో ఓ బైకర్‌కు దాని కాళ్లు తగిలాయి. దీంతో బైక్‌ను సంభాళించుకోలేకపోయిన అతను కిందపడ్డాడు. వెనుక వస్తున్న మరో బైకర్‌ దీనిని వీడియో తీశాడు. ఒళ్లు గగుర్పొడిచేరీతిలో దుప్పి చేసిన ఈ జంప్‌ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వేలమంది ఈ వీడియోను షేర్‌ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement