97 ఏళ్ల వృద్ధురాలికి యాంజియోప్లాస్టీ | 97 year-old woman undergoes angioplasty | Sakshi
Sakshi News home page

97 ఏళ్ల వృద్ధురాలికి యాంజియోప్లాస్టీ

Sep 3 2014 1:31 AM | Updated on Sep 2 2017 12:46 PM

ఇక్కడి ఓ ఆసుపత్రి వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా 97 ఏళ్ల వృద్ధురాలికి ప్రాణం పోశారు.

కోయంబత్తూరు: ఇక్కడి ఓ ఆసుపత్రి వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా 97 ఏళ్ల వృద్ధురాలికి ప్రాణం పోశారు. తొమ్మిది పదులు దాటిన ఆ మహిళకు సోమవారం సాయంత్రం తీవ్రమైన ఛాతీనొప్పి వచ్చింది. పొరుగునున్న వారు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల బృందం తగిన వైద్యమందించి ఆమె ప్రాణాలను కాపాడింది. ఇంత ముదిమి వయస్సున్న మహిళకు యాంజియోప్లాస్టీ చికిత్స చేయడం ఇదే ప్రథమమని ఆసుపత్రి చైర్మన్ జి.భక్తవత్సలం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement