కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

Published Mon, Feb 20 2017 3:05 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!


న్యూఢిల్లీ: 7వ వేతన సంఘం  అనుమతుల కమిటీ కేంద్ర ప్రభుత‍్వ ఉద్యోగులుకు తీపి కబురు అందించనుంది.  మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగుల  ఇంటి అద్దె అలవెన్స్ లేదా హెచ్‌ఆర్‌ఏ(హౌస్ రెంట్ అలవెన్స్ )ను 30 శాతం పెంచేందుకు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం,  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి  సోమవారం సమర్పించనున్న  తన నివేదికలో ఈ మేరకు  సిఫారసు చేసిందట, 7వ వేతన సంఘం ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏపై అందించిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బేసిక్‌ జీతంపై  30శాతం హెచ్‌ఆర్‌ఏ  చెల్లించాలని  పేర్కొన్న ట్టు తెలుస్తోంది.   దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగుల హెచ్‌ ఆర్‌ఏ పెంచేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఆర్థిక కార్యదర్శి అశోక్ ఉష్ణ ద్రవాల నేతృత్వంలోని అనుమతులు కమిటీ 7 వ వేతన సంఘం ఆధ్వర్యంలో అనుమతులను  సమీక్షించింది.  ఈ సిఫార్సులను ప్రకటించే అవకాశంఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఏ తప్ప మిగిలిన అలవెన్సులపై  సమీక్షించే నిమిత్తం 2016 జూలైలోఈ కమిటీని  ఏర్పాటు చేశారు.  తొలుత ఈ కమిటీనివేదికను అందించేకు  నాలుగు నెలలు సమయం ఇచ్చారు. అనంతరం ఈ గడువును ఫిబ్రవరి 22, 2017 వరకు పొడిగించారు.

కాగా  ఉద్యోగులకు చెల్లించే డీఏ 50శాతానికి  చేరుకునప్పుడు  ఇంటి అద్దె అలవెన్సు 27,  18,  9శాతానికి పెంచాలని  ప్యానల్‌ గతంలో తన నివేదికలో  పేర్కొంది.   డీఏ 100 శాతానికి పెంచినపుడు హెచ్‌ఆర్‌ఏ  30శాతంగా ఉండాలని 7వ వేతన సంఘం పేర్కొంది.   30శాతం డీఏఅమలైతే వరుసగా X, Y, Z నగరాలకు 20, శాతం 10శాతంగా  ఉండాలని తెలిపింది. దీంతో పాటు కొన్ని అలవెన్సులు రద్దుచేయడంతోపాటు, మరికొన్నింటిలో మార్పులు  చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement