రైల్వేకోడూరు మండలంలోని కందమడుగు అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్సార్(రైల్వేకోడూరు): రైల్వేకోడూరు మండలంలోని కందమడుగు అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది ఎర్రచందనం దొంగలను శనివారమే అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వారు దుంగలను పొదల్లో దాచిపెట్టినట్లు తెలపడంతో పోలీసులు వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.