సోమవారం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : జైరాం రమేష్ | 10 district Telangana Final, says Jairam ramesh | Sakshi
Sakshi News home page

సోమవారం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : జైరాం రమేష్

Dec 7 2013 2:12 PM | Updated on Sep 2 2017 1:22 AM

సోమవారం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : జైరాం రమేష్

సోమవారం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : జైరాం రమేష్

పది జిల్లాలతో కూడిన తెలంగాణే ఫైనల్ అని జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ స్ఫష్టం చేశారు.

న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణే ఫైనల్ అని జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ స్ఫష్టం చేశారు. రాయల తెలంగాణపై రాజకీయంగా ఏకాభిప్రాయం లేదని.... అసెంబ్లీ ప్రతిపాదన పంపిస్తే ఆలోచిస్తామని ఆయన తెలిపారు. సీమాంధ్రకు కాకినాడను రాజధాని చేయాలని కేంద్రమంత్రి పల్లంరాజు కోరారని జైరాం రమేష్ పేర్కొన్నారు.

అయితే విశాఖ, విజయవాడ, అమరావతి, కర్నూలును కొత్త రాజధాని ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రపతికి సోమవారం తెలంగాణ బిల్లును అక్కడ నుంచి అసెంబ్లీకి  పంపుతామని జైరాం రమేష్ తెలిపారు. జీవోఎం సభ్యులకు ఆంధ్రప్రదేశ్ పై అవగాహన ఉందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాయని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ పరిశీలిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement