వైఎస్‌ఆర్ సీపీ గెలుపును ఆపలేరు | YSRcp can stop winning | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీ గెలుపును ఆపలేరు

Apr 3 2014 2:41 AM | Updated on Aug 21 2018 5:36 PM

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నేత, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

పాల్వంచ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నేత, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పొంగులేటి శ్రీని వాసరెడ్డి, పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ బుధవారం పాల్వంచ మండలంలోని పాండురంగాపురం, రెడ్డిగూడెం, పునుకుల, పుల్లాయిగూడెం తదితర గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహిం చారు. జడ్‌పీటీసీ అభ్యర్థి బాలినేని నాగేశ్వరరావును, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 పొంగులేటి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థులు మల్లయ్య (పాండురంగాపురం), బి.జ్యోతి (సూరారం), బండి వెంకటేశ్వర్లు (పాయకారియానంబైల్), నాయకులు జాలే జానకిరెడ్డి, తుమ్మల శివారెడ్డి, పిట్టల వెంకటనర్సయ్య, మోహన్‌రావు, కె.నాగిరెడ్డి, సండ్రుపట్ల శ్రీనివాసరెడ్డి, మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దేవీ లాల్, భద్రయ్య, సలీమున్నీసాబేగం, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement