యువతి అదృశ్యం | Woman missing | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Sep 12 2015 7:31 PM | Updated on Sep 3 2017 9:16 AM

ఓ యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కాచిగూడ : ఓ యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్‌ఐ ఎస్.గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం... తిలక్‌నగర్ సంజీవయ్య నగర్ ప్రాంతానికి చెందిన ఎ.సౌందర్య(22) ఈ నెల 11వ తేదీన షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

దీంతో తెలిసిన వారి ఇళ్లలో వెతికినా సౌందర్య ఆచూకీ తెలియరాలేదు. దీంతో సౌందర్య సోదరుడు అవినాష్ శనివారం కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement