టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏం సాధించారు?’ | Why should TRS win this time in 16 seats | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏం సాధించారు?’

Mar 20 2019 3:31 AM | Updated on Mar 20 2019 3:31 AM

Why should TRS win this time in 16 seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్, ఎంఐఎంతో కలసి 16 మంది ఎంపీలు ఉన్నా వారు సాధించింది ఏమిటని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు విమర్శించారు. ఏమీ సాధించని టీఆర్‌ఎస్‌ను ఈసారి 16 స్థానాల్లో ఎందుకు గెలిపించాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో ఎన్ని గంటలు మాట్లాడారో చెప్పాలని, వారి ప్రోగ్రెస్‌ రిపోర్టు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బులెట్‌ ట్రైన్‌ గురించి విమర్శిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు ఇక్కడ ఎంఎంటీఎస్‌కు సంబంధించిన వాటా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే అని రాంచంద్రరావు ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement