తెలంగాణ అమరులకు నిజమైన నివాళి ఇవ్వాలనుకుంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు.
సిద్దిపేట: తెలంగాణ అమరులకు నిజమైన నివాళి ఇవ్వాలనుకుంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బైరాన్‌పల్లిలో తెలంగాణ విమోచన యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు.
అమరుల త్యాగాలను కేసీఆర్ మజ్లిస్‌కు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో రోశయ్యను నిలదీసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు.