ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి | Water Release in pushkarni | Sakshi
Sakshi News home page

ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి

Jul 11 2015 3:46 AM | Updated on Sep 3 2017 5:15 AM

ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి

ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి

గోదావరి పుష్కరాలకు శ్రీరాంసాగర్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికారులను ఆదేశించారు...

అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం
ప్రగతినగర్ :
గోదావరి పుష్కరాలకు శ్రీరాంసాగర్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి పుష్కరాలు జరిగే జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది భాగంలోని శ్రీరాంసాగర్, గుమ్మిర్యాల్, దోంచంద, సావె ల్, తడ్‌పాకల పుష్కర ఘాట్లకు శుక్రవారం రాత్రి నుంచే నీటిని వదలాలని ఆదేశించారు.

ఎస్సారెస్పీలోని 10 టీఎంసీల నీటి నిలువలో నుంచి 5 టీఎంసీల నీరు పుష్కరాల కోసం విడుదల చేయాలన్నారు. పుష్కరాల ప్రారంభానికి ఒకటి, రెండు రోజుల ముందే ఘాట్లకు నీరు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కందకుర్తి, దాని కింది భాగంలోని ఇతర ఘాట్లలో నీటికి కొంత ఇబ్బంది ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ దిగువ భాగంలోని ఘాట్ల వద్ద భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు.

అన్ని ఘాట్లలో ప్రత్యామ్నాయ నీటి ఏర్పాట్లతో షవర్‌లు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం రాత్రిలోగా అన్ని పుష్కర పనులు పూర్తి చేయూలని ఆదేశించారు.  ఘాట్ల వద్ద అధికారులందరికీ విధులు కేటారుుంచాలని, పురోహితులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ధరలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయూలని చెప్పారు. అనంతరం జేసీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు జిల్లాలోని అన్ని ఘాట్లలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారని, పనులు పూర్తి స్థాయిలోకి వచ్చాయని చెప్పారు. అన్ని ఘాట్లలో షవర్‌బాత్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐకేపీ పీడీ వెంకటేశం,  డీపీఓ కృష్ణమూర్తి, పుష్కరాల లైజనింగ్ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement