'మోదీ..ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోరు' | V Hanumantha rao takes on Chandrababu | Sakshi
Sakshi News home page

'మోదీ..ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోరు'

Jun 10 2015 2:32 PM | Updated on Sep 19 2019 8:28 PM

'మోదీ..ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోరు' - Sakshi

'మోదీ..ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోరు'

నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించిన ఏపీ సీఎం చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ సూటిగా ప్రశ్నించారు.

హైదరాబాద్: నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించిన ఏపీ సీఎం చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో వీహెచ్ మాట్లాడారు. తప్పు చేసిన చంద్రబాబు అరెస్ట్ కావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.  చంద్రబాబు తప్పు చేయలేదనుకుంటే సీబీఐ విచారణకు సిద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు పాల్పడటం పెద్ద నేరం అని వీహెచ్ అభివర్ణించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చంద్రబాబుకు బ్లాక్ మనీ ఎలా వచ్చిందో తెలియాలన్నారు. హైదరాబాద్లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదని వీహెచ్ తెలిపారు. సీమాంధ్రులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని వీహెచ్ ఆరోపించారు. దేశంలో నల్లధనం లేకుండా చేస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ... తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు వ్యవహారంలో ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోవడం లేదని వీహెచ్ సందేహం వ్యక్తం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement