వారణాసి చేరుకున్న పసుపు రైతులు | Turmeric Farmers Contesting Against Narendra Modi In Varanasi | Sakshi
Sakshi News home page

వారణాసి చేరుకున్న పసుపు రైతులు

Apr 27 2019 2:32 PM | Updated on Apr 27 2019 5:06 PM

Turmeric Farmers Contesting Against Narendra Modi In Varanasi - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఆర్మూరు పసుపు రైతుల బృందం వారణాసి చేరుకుంది. పసుపు రైతుల రాష్ట్ర జిల్లా అద్యక్షులు నర్సింహ నాయుడు, తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. వీరికి మద్దతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్‌ ప్రాంత పసుపు రైతులు తరలివచ్చారు. ఆర్మూర్‌, ఈరోడ్‌ ప్రాంతాల పసుపు రైతులు 29న సోమవారం నాడు వారణాసి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దాదాపు 50 మంది రైతులు పసుపు బోర్డు, మద్దతు ధరల కోసం ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement